జగన్.. రాష్ట్రాన్ని కల్తీకి కేరాఫ్ గామార్చారు: అనిత
ABN , Publish Date - Feb 07 , 2026 | 04:58 AM
ఐదేళ్ల జగన్‌రెడ్డి పాలన రాష్ట్రానికి ఓ పీడకల. కల్తీకి రాష్ట్రాన్ని కేరాఫ్ అడ్ర్‌సగా మార్చేశారు అని మంత్రి వంగలపూడి అనిత విమర్శించారు.
అమరావతి, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): ‘ఐదేళ్ల జగన్‌రెడ్డి పాలన రాష్ట్రానికి ఓ పీడకల. కల్తీకి రాష్ట్రాన్ని కేరాఫ్ అడ్ర్‌సగా మార్చేశారు’ అని మంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. ‘‘రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులా జగన్... ‘కల్తీ రిక్రూట్‌మెంట్ బోర్డు’ను స్థాపించి దానికి తానే అధ్యక్షుడిగా వ్యవహరించారు. కొవిడ్ సమయంలో ప్రాణాపాయ స్థితిలో ప్రజలకు కల్తీ మందుల సరఫరాతో మొదలైన కల్తీ దందా.. కల్తీ లిక్కర్, చివరికి శ్రీవారి నెయ్యిని కూడా కల్తీ చేసి జగన్ ప్రభుత్వం మహాపాపానికి పాల్పడింది. నిన్నటి వరకు నెయ్యి కల్తీ జరగలేదని బుకాయించిన వైవీ సుబ్డారెడ్డి ఈ రోజు మాట మార్చి కల్తీ జరిగిందని అంగీకరిస్తున్నారు. టీటీడీ పర్చేజ్ కమిటీ చైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి నెయ్యి కల్తీకి సూత్రధారి. జగన్ మళ్లీ పరామర్శ యాత్రల పేరుతో డ్రామాలు మొదలు పెట్టారు.’’ అన్నారు.