రాష్ట్రంలో విధ్వంసానికి జగన్ యత్నం
ABN , Publish Date - Feb 06 , 2026 | 03:04 AM
క్రిమినల్ ఆలోచనలతో రాష్ట్రంలో విధ్వంసం సృష్టించేందుకు జగన్ యత్నిస్తున్నారని హోం మంత్రి అనిత ఆరోపించారు.
ఆయన చేసేవి పరామర్శలు కావు... ప్రదర్శనలు: మంత్రి అనిత
నక్కపల్లి, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): క్రిమినల్ ఆలోచనలతో రాష్ట్రంలో విధ్వంసం సృష్టించేందుకు జగన్ యత్నిస్తున్నారని హోం మంత్రి అనిత ఆరోపించారు. గురువారం అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల తో మాట్లాడారు. ఆయన బూతుల మంత్రిగా పేరు పొందాడు. అంబటి ఏమైనా స్వాతంత్య్ర సమరయోధుడా..! పరామర్శించడానికి జగన్ వెళ్లాడానికి? పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వైసీపీ పాలనలో కల్తీ జరిగిందనడానికి పూర్తి ఆధారాలు ఉన్నాయి. మహాపాపాలు చేసి, మళ్లీ మా ప్రభుత్వంపై బురదజల్లేందుకు యత్నిస్తున్నారు. జగన్ చేసేవన్నీ పరామర్శలు కాదు... ప్రదర్శనలు’ అని ఎద్దేవా చేశారు.