రెవెన్యూ కేసుల పరిష్కారానికి చర్యలు: అనగాని
ABN , Publish Date - Mar 05 , 2026 | 04:47 AM
రెవెన్యూ శాఖకు సంబంధించి హైకోర్టులో ఉన్న పెండింగ్ కేసులను సకాలంలో క్లియర్ చేసేందుకు ప్రతి జిల్లాలో లైజనింగ్ ఆఫీసర్లను నియమించామని మంత్రి అనగాని చెప్పారు.
రెవెన్యూ శాఖకు సంబంధించి హైకోర్టులో ఉన్న పెండింగ్ కేసులను సకాలంలో క్లియర్ చేసేందుకు ప్రతి జిల్లాలో లైజనింగ్ ఆఫీసర్లను నియమించామని మంత్రి అనగాని చెప్పారు. జిల్లాస్థాయిలో కలెక్టర్ల నాయకత్వంలో లీగల్ సెల్ ఏర్పాటు చేశామన్నారు. యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. 32,970 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ అంశంపై స్పీకరు అయ్యన్న మాట్లాడుతూ.. న్యాయబద్ధమైన కేసుల్లో కూడా ప్రభుత్వం హైకోర్టులో ఓడిపోతోందని, లైజనింగ్ ఆఫీసర్లు అవతలి పార్టీలతో కుమ్మక్కైపోతున్నారా? లేక ప్రభుత్వ లాయర్లు సరిగ్గా వాదించడం లేదా? అని ప్రశ్నించారు. దీనిపై సమీక్ష నిర్వహిస్తానని, కుమ్మక్కైనట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి బదులిచ్చారు.