Share News

క్రాప్‌ డైవర్షన్‌కు కార్యాచరణ : మంత్రి అచ్చెన్న

ABN , Publish Date - Mar 05 , 2026 | 04:46 AM

రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణాన్ని సమతుల్యం చేస్తూ రైతులను లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించేలా ప్రభుత్వం ‘క్రాప్‌ డైవర్షన్‌’ విధానాన్ని....

క్రాప్‌ డైవర్షన్‌కు కార్యాచరణ : మంత్రి అచ్చెన్న

రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణాన్ని సమతుల్యం చేస్తూ రైతులను లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించేలా ప్రభుత్వం ‘క్రాప్‌ డైవర్షన్‌’ విధానాన్ని అమలు చేస్తోందని, ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేశామని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. రాయలసీమలో 15 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగు చేసి ఆ ప్రాంతాన్ని హార్టికల్చర్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మిగిలిన డెల్టా ప్రాంతాల్లో కూడా వరిసాగుకు బదులుగా పప్పు ధాన్యాలు, చిరు ధాన్యాలు, పామాయిల్‌ తదితర పంటలను ప్రోత్సహించేందుకు రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

Updated Date - Mar 05 , 2026 | 04:46 AM