మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అచ్చెన్న
ABN , Publish Date - Mar 05 , 2026 | 04:10 AM
శాసనమండలిలో వైసీపీ కుయుక్తులను ధీటుగా ఎదుర్కోవడంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయు డు విజయం సాధించారని...
కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రశంస
అమరావతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): శాసనమండలిలో వైసీపీ కుయుక్తులను ధీటుగా ఎదుర్కోవడంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయు డు విజయం సాధించారని, బుధవారం నాటి సభలో ఆయన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచారని కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రశంసించారు. మండలిలో బుధవారం తిరుపతి లడ్డూ.. కల్తీ నెయ్యి వ్యవహారంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీలు అసత్య ఆరోపణలతో చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. దీనిపై పదే పదే కూటమి సభ్యులు అభ్యంతరం తెలిపినా వైసీపీ సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో మంత్రి అచ్చెన్న జోక్యం చేసుకుని.. వారి నాయకుడు జగన్ క్రైస్తవాన్ని ఆచరిస్తూ తిరుమల పవిత్రతపై మాట్లాడటం ఏమిటని? ప్రశ్నించారు. జగన్ క్రైస్తవుడా.. హిందువా? అన్న అంశంపై స్పష్టత ఇచ్చిన తర్వాతే వైసీపీ సభ్యులు సభలో మాట్లాడాలన్నారు. దీంతో వైసీపీ సభ్యులు ఆత్మరక్షణలో పడి.. సభను సజావుగా సాగకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో చైర్మన్ మండలిని వాయిదా వేశారు.