Share News

మైక్రో ఇరిగేషన్‌కు నిధులు విడుదల చేయండి: అచ్చెన్న

ABN , Publish Date - Feb 23 , 2026 | 04:46 AM

మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు అమలుకు సంబంధించి కేంద్రం వాటా నిధుల్ని తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు...

మైక్రో ఇరిగేషన్‌కు  నిధులు విడుదల చేయండి:  అచ్చెన్న

తిరుమల, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు అమలుకు సంబంధించి కేంద్రం వాటా నిధుల్ని తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు విజ్ఞప్తి చేశారు. కేంద్ర వాటా కింద రాష్ట్రానికి రూ.695కోట్లు రావాల్సి ఉందని, ఈనెలలో కేవలం రూ.50కోట్లు మాత్రమే విడుదలయ్యాయని, మార్చిలోపు కనీసం రూ.400కోట్లు విడుదల చేయాలని కోరారు. ఈ నిధులను ఆర్‌కేవీవై, పీడీఎంసీ పథకం ద్వారా మంజూరు చేయాలని సూచించారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన కేంద్రమంత్రిని అచ్చెన్నాయుడు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమ కార్యక్రమాల అమలు, కేంద్ర పథకాల సమర్థవంతమైన అమలు వంటి వివిధ అంశాలపై చర్చించారు.

Updated Date - Feb 23 , 2026 | 04:47 AM