Share News

గొడ్డలి పార్టీని గొయ్యితీసి పాతండి: అచ్చెన్న

ABN , Publish Date - Jul 02 , 2026 | 03:49 AM

గొడ్డలి పార్టీ వల్ల రాష్ట్రం 25ఏళ్లు వెనక్కు వెళ్లింది. రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలను ఆ పార్టీ వాటాలు అడగడంతో వెనక్కు వెళ్లాయి’ అని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు.

గొడ్డలి పార్టీని గొయ్యితీసి పాతండి: అచ్చెన్న

టెక్కలి, జూలై 1(ఆంధ్రజ్యోతి): ‘గొడ్డలి పార్టీ వల్ల రాష్ట్రం 25ఏళ్లు వెనక్కు వెళ్లింది. రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలను ఆ పార్టీ వాటాలు అడగడంతో వెనక్కు వెళ్లాయి’ అని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం రాంపురంలో ఆయన మాట్లాడారు. ‘రాజకీయాలకు జగన్‌ అనర్హుడు. విధ్వంసం ఆయన ఎజెండా. వైసీపీకి, జగన్‌కు, ఆ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్‌ అన్నా, తెలుగువాళ్లు అన్నా కక్ష. గొడ్డలి పార్టీని వెయ్యి అడుగుల గొయ్యి తీసి పాతేయండి. ఐదేళ్లు అధికారంలో ఉండి పోజులిచ్చారు తప్ప అభివృద్ధి మరిచారు’ అని అచ్చెన్న మండిపడ్డారు. రైతుల పేరుతో జగన్‌ రాజకీయ కుట్రకు పాల్పడుతున్నాడని విమర్శించారు.

Updated Date - Jul 02 , 2026 | 03:49 AM