ఉక్కు భూములూ ఆక్రమించాలనుకున్నారు
ABN , Publish Date - May 26 , 2026 | 05:53 AM
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని గత వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని చూసిందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు.
జగన్‌రెడ్డిపై మంత్రి అచ్చెన్న ఆరోపణ
టెక్కలి, మే 25(ఆంధ్రజ్యోతి): విశాఖ ఉక్కు కర్మాగారాన్ని గత వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని చూసిందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఉక్కు భూములను కూడా ఆక్రమించాలని జగన్‌రెడ్డి చూశారన్నారు. శ్రీకాకుళం జిల్లా చీపుర్లపాడు పంచాయతీ ఊడికలపాడులో ఎంఎస్ఎంఈ పార్కు శంకుస్థాపన కార్యక్రమంలో అచ్చెన్న మాట్లాడుతూ అధికారం కోసం జగన్‌రెడ్డి ఎవరినీ వదలరని, స్వార్థం కోసం ఎవరినైనా బలిచేసే నైజం ఆయనదని ధ్వజమెత్తారు.