Share News

యూజర్‌ చార్జీలను పెంచిన గనులశాఖ

ABN , Publish Date - Mar 10 , 2026 | 06:08 AM

గనుల శాఖ అందిస్తున్న సేవల చార్జీలు పెరిగాయి. సున్నపురాయిపై 0.50 శాతం, ఇతర మేజర్‌ మినరల్స్‌పై 1 శాతం, గ్రానైట్‌పై 1.25 శాతం, మైనర్‌ మినరల్స్‌పై...

యూజర్‌ చార్జీలను పెంచిన గనులశాఖ
Mining Dept of AP

అమరావతి, మార్చి 9(ఆంధ్రజ్యోతి): గనుల శాఖ అందిస్తున్న సేవల చార్జీలు పెరిగాయి. సున్నపురాయిపై 0.50 శాతం, ఇతర మేజర్‌ మినరల్స్‌పై 1 శాతం, గ్రానైట్‌పై 1.25 శాతం, మైనర్‌ మినరల్స్‌పై 1 శాతం, ఖనిజాల రవాణా పాస్‌లపై 5 శాతం, నామినేషన్‌ బేసిస్ పై ఇచ్చే లీజులపై హెక్టారుకు 100 చొప్పున వినియోగ చార్జీలు పెంచారు. ఈ మేరకు గనుల శాఖ ముఖ్యకార్యదర్శి మీనా సోమవారం ఉత్తర్వులు (జీఓ 54)జారీ చేశారు. కాగా, జిల్లా ఖనిజ నిధి (డీఎంఎఫ్)లో 70 శాతం మైనింగ్‌ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, విద్య, వైద్యం, ఇతర అవసరాలకే వినియోగించాలని మరో ఉత్తర్వు జారీ చేశారు.

Updated Date - Mar 10 , 2026 | 06:35 AM