Share News

కనీస వేతనాలు సవరించాలి

ABN , Publish Date - Jul 20 , 2026 | 11:44 PM

జీడి, రైస్‌ మిల్లుల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు సవరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్‌.గణపతి, మందస మండల కన్వీనర్‌ కె.కేశవరావులు డిమాండ్‌ చేశారు.

 కనీస వేతనాలు సవరించాలి
ధర్నా నిర్వహిస్తున్న కార్మికులు :

హరిపురం, జూలై20(ఆంధ్రజ్యోతి): జీడి, రైస్‌ మిల్లుల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు సవరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్‌.గణపతి, మందస మండల కన్వీనర్‌ కె.కేశవరావులు డిమాండ్‌ చేశారు. మంగళవారం మందస తహ సీల్దార్‌ కార్యాలయం ఎదుట కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించి రెవెన్యూ ఇనస్పె క్టర్‌ ఇందిరకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఆర్‌.ఏకాశి, వల్లభవరావు, కృష్ణారావు, ధర్మారావు, జగ్గారావు, లచ్చమయ్య మల్లేసు, జానకమ్మ, శాంతమ్మ, బాలమ్మ, దమయంత్రి, చంద్రావతి, ధనలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Jul 20 , 2026 | 11:44 PM