Share News

కనీస వేతనం ఇవ్వాలి

ABN , Publish Date - Feb 24 , 2026 | 12:24 AM

అంగనవాడీలకు కనీస వేతనం ఇవ్వాలని ఆ సంఘం అధ్యక్షురాలు చాందినీ డిమాండ్‌ చేశారు. సోమవారం వెల్దుర్తి తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో వెల్దుర్తి, క్రిష్ణగిరి మండలాల (వెల్దుర్తి ఐసీడీఎస్‌ ప్రాజెక్టు) అంగనవాడీలు రిలే దీక్షలు చేపట్టారు.

  కనీస వేతనం ఇవ్వాలి
వెల్దుర్తి: రిలే దీక్షలు చేస్తున్న అంగనవాడీలు

అంగనవాడీ యూనియన

నాయకుల డిమాండ్‌

డివిజన వ్యాప్తంగా రిలే దీక్షలు

వెల్దుర్తి, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): అంగనవాడీలకు కనీస వేతనం ఇవ్వాలని ఆ సంఘం అధ్యక్షురాలు చాందినీ డిమాండ్‌ చేశారు. సోమవారం వెల్దుర్తి తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో వెల్దుర్తి, క్రిష్ణగిరి మండలాల (వెల్దుర్తి ఐసీడీఎస్‌ ప్రాజెక్టు) అంగనవాడీలు రిలే దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు చాందినీ మాట్లాడుతూ కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, గ్రాట్యూటీ అమలుచేయాలని, గతంలో చేపట్టిన సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరారు. డిమాండ్ల పరిష్కారం కోసం ఈనెల 27 వరకు రిలే దీక్షలు చేపట్టనున్నామని తెలిపారు. దీక్షలో ఈదమ్మ, విజయకుమారి, హెస్సీబా, సుమలత, సరస్వతి, వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఆదోని రూరల్‌ : అంగనవాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అంగనవాడీ యూనియన నాయకురాలు ఈరమ్మ, జానకి, గౌసియా, ప్రభావతి డిమాండ్‌ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం రిలే నిరాహారదీక్షలు చేపట్టారు.

పత్తికొండ టౌన్‌: పత్తికొండలో సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అలాగే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో సీఐటీయూ జిల్లా నాయకులు వెంకటేశ్వరరెడ్డి, ఏఐటీయూసీ జిల్లా నాయకులు కృష్ణయ్య, నాయకులు రంగన్న, నెట్టికంటయ్య, రవిచంద్ర, గోపాల్‌, అంగన్‌వాడీ నాయకురాళ్లు కాంతమ్మ, చిట్టెమ్మ, పద్మజ తదితరులు పాల్గొన్నారు.

ఆలూరు: ఆలూరు పాత బస్టాండు ఆవరణలో ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ వర్కర్స్‌ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కె.పి. నారాయణస్వామి, నాయకులు విఠల్‌, అంగన్‌వాడీ వర్కర్స్‌ నాయకులు ప్రభావతి, భారతి, భాగ్యలక్మి, రత్నమ్మ, రాజేశ్వరి, లక్ష్మి, పార్వతమ్మ, విశాలాక్షి, సరస్వతి, జయమ్మ పాల్గొన్నారు.

ఆస్పరి: ఆస్పరిలో ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ వర్కర్లు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ తాలూకా కార్యదర్శి ఎం.కృష్ణమూర్తి, అంగన్‌వాడీ యూనియన్‌ నాయకురాలు రూతమ్మ, నాగమణి, జ్యోతి, శ్రీదేవి, ఎలిజబెత్‌రాణి, నాగమణి, అంగన్‌వాడీ వర్కర్స్‌ చిట్టెమ్మ, మంజు, రాజమ్మ, విమల, లక్ష్మిదేవి పాల్గొన్నారు.

Updated Date - Feb 24 , 2026 | 12:24 AM