మినీ గోకులంతో రైతులకు మేలు: ఎమ్మెల్యే
ABN , Publish Date - Jan 09 , 2026 | 11:51 PM
మినీ గోకులం షెడ్ నిర్మాణం వల్ల పాడి రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుందని ఎమ్మెల్యే జయసూర్య అన్నారు.
నందికొట్కూరు రూరల్, జనవరి9(ఆంధ్రజ్యోతి) : మినీ గోకులం షెడ్ నిర్మాణం వల్ల పాడి రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుందని ఎమ్మెల్యే జయసూర్య అన్నారు. శక్రవారం మండలంలోని బొల్లవరం గ్రామంలో నిర్మించిన మూడు గోకులం షెడ్‌లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు అన్నిరకాలుగా ఆదుకుంటుందన్నారు. అలాగే ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరు అయిన చెక్కును బాధితురాలు రాధిక కు అందించారు. కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు నందికొట్కూరు కన్వీనర్ మాండ్ర సురేంద్ర నాథరెడ్డి, జనసేన నియోజకవర్గ ఇనచార్జి నల్లమల రవికుమార్, మార్కెట్ యార్డ్ చైర్మన ప్రసాదరెడ్డి, నాయకులు లక్ష్మి నారాయణరెడ్డి, పలుచాని మహేశ్వరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
పాములపాడు: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలుపే లక్ష్యంగా ప్రతి నా యకుడు, కార్యకర్తలు సై నికుల్లా పనిచేయాలని ఎ మ్మెల్యే గిత్తా జయసూర్య సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలో మం డల స్థాయి కార్యకర్తల స మావేశం నిర్వహించారు. దిశనిర్దేశం చేశా రు. కా ర్యక్రమంలో టీడీపీ నా యకులు నందికొట్కూర్ టీడీపీ ఇనచార్జి మాండ్ర సురేంద్రనాద్‌రెడ్డి, మండల కన్వీనర్ రవీంద్రరెడ్డి యాదవ కార్పొరేషన రాష్ట్ర డైరెక్టర్ వెంకటేశ్వర్లయాదవ్, నాయకులు తిమ్మారెడ్డి, హరినాథ్‌రెడ్డి, సొసైటీ చైర్మన్లు, నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ఎంపీడీవో కార్యలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యే జయసూర్య పాల్గొన్నారు. వివిధ గ్రామాల ప్రజలు ఇచ్చిన వినతులను స్వీకరించారు. సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎంపీడీవో, పీఆర్‌ఏఈలు సహకరించడం లేదని గ్రామ నాయకులు ఎమ్మెల్యే కు ఫిర్యాదు చేయడంతో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల అధికారులు, నాయకులు పాల్గొన్నా రు. అలాగే పాములపాడులోని ఎస్సీ కాలనీలో గోకులంషెడ్డును స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభిచారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.