Share News

మిలాద్‌-ఉన్‌ నబి సెలవు 26న

ABN , Publish Date - Aug 21 , 2026 | 04:16 AM

మిలాద్‌-ఉన్‌-నబి సెలవును ప్రభుత్వం ఈనెల 25వ తేదీ నుంచి 26వ తేదీకి మార్పు చేసింది. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు గురువారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

మిలాద్‌-ఉన్‌ నబి సెలవు 26న

అమరావతి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): మిలాద్‌-ఉన్‌-నబి సెలవును ప్రభుత్వం ఈనెల 25వ తేదీ నుంచి 26వ తేదీకి మార్పు చేసింది. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు గురువారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం తొలుత విడుదల చేసిన సెలవుల జాబితాలో ఆగస్టు 25న మిలాద్‌-ఉన్‌-నబిగా ప్రచురించింది. రాష్ట్ర వక్ఫ్‌బోర్డ్‌ సీఈవో విన్నపం మేరకు దీనిని తాజాగా 26వ తేదీకి మార్పు చేసింది. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు బ్యాంకులు, ఇతర సంస్థలకు 26నే సాధారణ సెలవు.

Updated Date - Aug 21 , 2026 | 04:17 AM