అన్నవరంలోని ప్రసాద విక్రయ కేంద్రంలో మూషికాలు
ABN , Publish Date - Jan 24 , 2026 | 05:10 AM
భక్తులు ఎంతో పవిత్రంగా భావించే అన్నవరం సత్యదేవుని ప్రసాదంపై ఎలుకలు తిరుగాడటం కలకలం రేపింది.
వీడియో తీసిన భక్తులు.. సిబ్బందిపై చర్యలు
అన్నవరం, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): భక్తులు ఎంతో పవిత్రంగా భావించే అన్నవరం సత్యదేవుని ప్రసాదంపై ఎలుకలు తిరుగాడటం కలకలం రేపింది. సాక్షాత్తూ ప్రసాద విక్రయ కేంద్రంలో కళ్లెదురుగా ఎలుకలు ఇష్టారీతిన తిరుగుతున్నా సిబ్బంది ఉదాసీనంగా వ్యవహరించారు. భక్తులు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. దీంతో ఆలయ ఈవో త్రినాథరావు తక్షణం చర్యలకు ఆదేశించారు. పాత నమూనాలయం వద్ద పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులను విధుల నుంచి తాత్కాలికంగా తొలగించాలని ఆదేశించారు.