Natural Medicine Advisor: సీఎంని కలసిన మంతెన
ABN , Publish Date - Jan 11 , 2026 | 04:17 AM
ప్రకృతి వైద్య విభాగానికి ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన మంతెన సత్యనారాయణ రాజు ముఖ్యమంత్రి చంద్రబాబును శనివారం కలిశారు
అమరావతి, జనవరి 10(ఆంధ్రజ్యోతి): ప్రకృతి వైద్య విభాగానికి ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన మంతెన సత్యనారాయణ రాజు ముఖ్యమంత్రి చంద్రబాబును శనివారం కలిశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో కలసిన మంతెన.. సలహాదారుగా తనకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మంతెనకు సీఎం శుభాకాంక్షలు చెప్పారు.