హైకోర్టులో మెగా వైద్య శిబిరం ప్రారంభం
ABN , Publish Date - Mar 31 , 2026 | 06:11 AM
కాటూరి మెడికల్ కాలేజీ సహకారంతో ఏపీహెచ్‌సీఏఏ ఆధ్వర్యంలో హైకోర్టులో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
అమరావతి, మార్చి 30(ఆంధ్రజ్యోతి): కాటూరి మెడికల్ కాలేజీ సహకారంతో ఏపీహెచ్‌సీఏఏ ఆధ్వర్యంలో హైకోర్టులో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. రెండు రోజుల ఈ మెగా వైద్య శిబిరాన్ని సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ప్రారంభించారు. కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడు కేవీ రఘువీర్, ప్రధాన కార్యదర్శి సుబోధ్, బార్ కౌన్సిల్ సభ్యుడు కె.చిదంబరం, న్యాయవాది నర్రా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు న్యాయవాదులు, కోర్టు ఉద్యోగులు, పోలీస్, హౌస్ కీపింగ్ సిబ్బంది ఈ శిబిరంలో వైద్యపరీక్షలు చేయించుకున్నారు. కాటూరి కళాశాల, హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వై.కిరణ్‌కుమార్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఫణీంద్ర, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.అజయ్ తదితరులు వైద్య సేవలందించారు.