Share News

వైసీపీ ఓ అబద్ధాల ఫ్యాక్టరీ

ABN , Publish Date - Jun 09 , 2026 | 05:38 AM

కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి, నిరుద్యోగుల ఇళ్లలో వెలుగులు నింపిందని, కానీ వైసీపీ అనే అబద్ధాల ఫ్యాక్టరీ..

వైసీపీ ఓ అబద్ధాల ఫ్యాక్టరీ

  • ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్‌, భూమిరెడ్డి

కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి, నిరుద్యోగుల ఇళ్లలో వెలుగులు నింపిందని, కానీ వైసీపీ అనే అబద్ధాల ఫ్యాక్టరీ ఆ విజయాన్ని జీర్ణించుకోలేక దుష్ప్రచారం చేస్తోందని ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్‌, భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం వారు విలేకరులతో మాట్లాడారు. రాంగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ.. స్పోర్ట్స్‌ కోటాలో టెట్‌ పాస్‌ కాకుండా ఎక్కడైనా స్కూల్‌ అసిస్టెంట్‌ లేదా ఎస్జీటీ ఉద్యోగాలు ఇప్పించినట్లు నిరూపిస్తే తాను, శ్రీకాంత్‌ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేస్తామని సవాల్‌ విసిరారు. డీఎస్సీలో అక్రమాలు నిరూపిస్తామంటే.. తాడేపల్లి ప్యాలె్‌సలోనైనా.. ఇడుపులపాయ ప్యాలెస్‌లోనైనా.. ఎక్కడైనా తాము చర్చకు సిద్ధమన్నారు. కంచర్ల శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు.. ప్రతియేటా జనవరి 1న జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని చెప్పిన జగన్‌ ఒక్క డీఎస్సీ కూడా విడుదల చేయకుండా నిరుద్యోగ యువతను మోసం చేశారని ఆరోపించారు.

Updated Date - Jun 09 , 2026 | 05:42 AM