Share News

మెడ్‌టెక్‌ జోన్‌లో క్యాథల్యాబ్‌ పరికరాల తయారీ

ABN , Publish Date - Jul 12 , 2026 | 05:46 AM

వైద్య పరికరాల తయారీ రంగంలో మెడ్‌టెక్‌ జోన్‌ మరో ముందడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మెడ్‌టెక్‌ జోన్‌లో ఇన్వల్యూషన్‌ హెల్త్‌కేర్‌ ప్రైవేటు లిమిటెడ్‌..

మెడ్‌టెక్‌ జోన్‌లో క్యాథల్యాబ్‌ పరికరాల తయారీ

  • ఇన్వల్యూషన్‌ హెల్త్‌కేర్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు కేంద్ర ఔషధ ప్రమాణ నియంత్రణ సంస్థ అనుమతి

ఉక్కుటౌన్‌షిప్‌(విశాఖపట్నం), జూలై 11 (ఆంధ్రజ్యోతి): వైద్య పరికరాల తయారీ రంగంలో మెడ్‌టెక్‌ జోన్‌ మరో ముందడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మెడ్‌టెక్‌ జోన్‌లో ఇన్వల్యూషన్‌ హెల్త్‌కేర్‌ ప్రైవేటు లిమిటెడ్‌ (ఐహెచ్‌పీఎల్‌) కార్డియాక్‌ కాథెటరైజేషన్‌ ల్యాబొరేటరీల్లోని (క్యాథ్‌ ల్యాబ్‌.. గుండె జబ్బులను గుర్తించే పరికరాలు ఉంటాయి) పరికరాల తయారీకి కేంద్ర ఔషధ ప్రమాణ నియంత్రణ సంస్థ నుంచి అనుమతి లభించింది. మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా అత్యాధునిక గుండె వైద్య పరికరాలను దేశీయంగా తయారుచేసే దిశగా ఇది కీలక అడుగుగా అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మెడ్‌టెక్‌ జోన్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో జోన్‌ సీఈవో జితేంద్రశర్మ మాట్లాడుతూ ఇది ఒక కంపెనీకి అనుమతి రావటం మాత్రమే కాదని, భారత్‌ మెడ్‌టెక్‌ రంగంలో ప్రపంచ స్థాయిలో ఎదుగుతుందని నిరూపించే ఘట్టంగా పేర్కొన్నారు. ఐహెచ్‌పీఎల్‌ ఎండీ గౌరవ్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణ రంగంలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా నమ్మకమైన, అధిక నాణ్యతతో ఉత్పత్తులు అందించేందుకు ముం దుంటామని ఆశాభావం వ్యక్తంచేశారు.

Updated Date - Jul 12 , 2026 | 05:47 AM