Share News

హజ్‌ యాత్రికులకు మెడి కల్‌ స్కీనింగ్‌

ABN , Publish Date - Feb 13 , 2026 | 12:12 AM

ప్రభుత్వ ఆదేశాల మేరకు హాజ్‌(మక్కా)కు వెళ్లే యాత్రికులకు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో డిప్యూటీ డీఎంహెచవో సత్యవతి ఆధ్వర్యంలో గురువారం మె డికల్‌ స్కీనింగ్‌ నిర్వహించారు.

హజ్‌ యాత్రికులకు మెడి కల్‌ స్కీనింగ్‌
మాట్లాడుతున్న డిప్యూటీ డీఎంహెచవో సత్యవతి

డివిజన పరిధిలో ఉన్న 57మందికి వ్యాక్సినేషన

డిప్యూటీ డీఎంహెచవో సత్యవతి

ఆదోని రూరల్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ఆదేశాల మేరకు హాజ్‌(మక్కా)కు వెళ్లే యాత్రికులకు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో డిప్యూటీ డీఎంహెచవో సత్యవతి ఆధ్వర్యంలో గురువారం మె డికల్‌ స్కీనింగ్‌ నిర్వహించారు. డివిజన పరిధిలోని ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ, తదితర మండలాల నుంచి హజ్‌కెళ్లే దాదాపు 57మంది యాత్రికులకు మెనింగో, కోకల్‌ వ్యాక్సిన, సీజనల్‌ ఇన ఫ్లూ ఏంజా వ్యాక్సినలు వేయడంతోపా టు వివిధ రకాల రక్తపరీక్షలు, బీపీ, షుగర్‌ వంటివి పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో వైద్యులు పృద్వీరాజ్‌, ఉదయ్‌ శంకర్‌, నీరంజన, ప్రసన్న విజయకుమారి, షహనాజ్‌, హెల్త్‌ వర్కర్లు పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2026 | 12:12 AM