Share News

మెనూ ప్రకారం భోజనం అందించాలి

ABN , Publish Date - Apr 10 , 2026 | 11:49 PM

విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని టీడీపీ ఆలూరు ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి సూచించారు.

మెనూ ప్రకారం భోజనం అందించాలి
విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న వైకుంఠం జ్యోతి

- టీడీపీ ఆలూరు ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి

ఆలూరు, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని టీడీపీ ఆలూరు ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి సూచించారు. శుక్రవారం అరికెర డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ గురు కులాన్ని ఆమె పరిశీలించారు. మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి వి ద్యార్థులతో కలిసి భోజనం చేశారు. గురుకులంలో సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. స్నేహభావంతో ఉండాలని, ఎవరిని ర్యాగింగ్‌ చేయకూడదన్నారు. కష్టపడి చదువుకుని గురుకు లానికి మంచిపేరు తీసుకురావాలన్నారు. పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు మంత్రి నారా లోకేశ రూ.35 లక్షలు మంజూరు చేశారని, వేసవి సెలవులో అన్ని మరమ్మతులు పనులు చేసేలా చూస్తామన్నారు. గురుకులంలో సైన్స్‌ కోర్సును ప్రవేశపెట్టాలని విద్యార్థులు, అధ్యాపకులు ఆమెను కోరారు. మంత్రి లోకేష్‌ దృష్టికి సమస్యను తీసుకెళ్తామన్నారు. సైన్స్‌ వారోత్సవాల్లో జిల్లాలో ప్రతిభ కనబరిచిన ఇద్దరు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు బాలచంద్రుడిని అభినందించారు. ఆమె వెంట ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ మల్లికార్జున, నాయకులు ఉన్నారు.

ప్రజాదర్బార్‌లో వినతుల స్వీకరణ

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజాదర్బార్‌ నిర్వహిస్తున్నట్లు టీడీపీ ఆలూరు ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి తెలిపారు. ఆలూరులో ప్రజాదర్బార్‌ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వినతులను పరిశీలించి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు పంపుతున్నట్లు ఆమె తెలిపారు.

Updated Date - Apr 10 , 2026 | 11:49 PM