Share News

లోన్‌ యాప్‌కు ఎంబీఏ విద్యార్థి బలి

ABN , Publish Date - Mar 28 , 2026 | 06:00 AM

లోన్‌ యాప్‌ రుణం మరో విద్యార్థిని బలి తీసుకుంది. తీసుకున్న రుణం తీర్చలేక.. లోన్‌ యాప్‌ వాళ్ల వేధింపులు తట్టుకోలేక ఎంబీఏ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

 లోన్‌ యాప్‌కు ఎంబీఏ విద్యార్థి బలి

గండేపల్లి, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): లోన్‌ యాప్‌ రుణం మరో విద్యార్థిని బలి తీసుకుంది. తీసుకున్న రుణం తీర్చలేక.. లోన్‌ యాప్‌ వాళ్ల వేధింపులు తట్టుకోలేక ఎంబీఏ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు.. అనకాపల్లి జిల్లా వడ్డాదిమాడుగుల గ్రామానికి చెందిన విద్యార్థి మహమ్మద్‌ బషీర్‌ (22) కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంలోని ప్రైవేట్‌ కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కొన్నాళ్ల క్రితం అతడు లోన్‌ యాప్‌లో రుణం తీసుకున్నాడు. ఆ అప్పు తిరిగి చెల్లించకపోవడంతో లోన్‌ యాప్‌ వాళ్ల వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ విషయం తల్లిదండ్రులకూ చెప్పుకోలేక మానసిక సంఘర్షణకు గురయ్యాడు. ఈ క్రమంలో తాను ఉంటున్న రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Updated Date - Mar 28 , 2026 | 06:01 AM