Share News

‘మావిగన్‌’ ప్రతిపాదనలో తప్పేముంది?

ABN , Publish Date - Apr 05 , 2026 | 05:22 AM

తమ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ‘మావిగన్‌’ను ప్రతిపాదించడంలో తప్పేముందని వైసీపీ నేత, శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విశా ఖలో శనివారం మాట్లాడారు.

‘మావిగన్‌’ ప్రతిపాదనలో తప్పేముంది?

  • మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అభివృద్ధి చెందాలన్నదే జగన్‌ ఆకాంక్ష: బొత్స

విశాఖపట్నం, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): తమ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ‘మావిగన్‌’ను ప్రతిపాదించడంలో తప్పేముందని వైసీపీ నేత, శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విశా ఖలో శనివారం మాట్లాడారు. ‘మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి రాజధానిగా అభివృద్ధి చెందాలన్నదే జగన్‌ ఆకాంక్ష. మీడియా కేవ లం రాజధాని అంశానికే ప్రాధాన్యం ఇస్తూ రైతులు, విద్యార్థులతోపాటు ప్రజల సమస్యలను విస్మరించడం దురదృష్ణకరం. అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదు. అవినీతికి మాత్రమే వ్యతిరేకం. ఆ కారణంతోనే పార్లమెంటులో మా పార్టీ సభ్యులు వాకౌట్‌ చేశారు. వైసీపీ హయాంలో అమరావతి రైతులకు కౌలు డబ్బులు ఒక్కరోజు కూడా ఆపలేదు. ఆ ప్రాంత రైతులకు కూటమి ప్రభుత్వం చేసిన అదనపు మేలు ఏమిటో చెప్పాలి? అమరావతిపై అసెంబ్లీలో తీర్మానం చేసి, మండలిలో ఎందుకు ప్రవేశపెట్టలేదు? అమరావతి లో వైర్లు కాలిపోయిన ఘటనపై ఎందుకు విచారణ చేయలేదు? ప్రత్యేక హోదా గురించి ఎందుకు నోరెత్తడం లేదు?’ అని ప్రశ్నించారు. సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2026 | 05:24 AM