Share News

తాడేపల్లి ప్యాలెస్‌ ఒక్కటే మావిగన్‌!

ABN , Publish Date - Apr 10 , 2026 | 04:00 AM

ఒక్క వైసీపీ మినహా దేశంలోని అన్ని పార్టీల ఆమోదంతో రాష్ట్ర రాజధానిగా అమరావతి చట్టబద్థత పొందిన సంతోష సమయంలో..

తాడేపల్లి ప్యాలెస్‌ ఒక్కటే మావిగన్‌!

  • ఆ ప్రాంతంలో వెలసిన ఫ్లెక్సీలు, పోస్టర్లను పీకేసిన జనం

గుంటూరు, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి) ఒక్క వైసీపీ మినహా దేశంలోని అన్ని పార్టీల ఆమోదంతో రాష్ట్ర రాజధానిగా అమరావతి చట్టబద్థత పొందిన సంతోష సమయంలో.. దీనిని తట్టుకోలేక మాజీ సీఎం జగన్‌ లేవనెత్తిన మావిగన్‌పై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో వెల్లడించే సంఘటన గురువారం చోటుచేసుకుంది. ‘మావిగన్‌’ నినాదంతో తాడేపల్లి ప్రాంతంలో గురువారం ఉదయాన్నే పలు పోస్టర్లు, ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి. అయితే అధికారులు రంగంలోకి దిగకముందే ప్రజలు ఆగ్రహంతో స్వయంగా వాటిని తొలగించారు. ప్రస్తుతం తాడేపల్లిలోని జగన్‌ ప్యాలెస్‌ వద్ద మాత్రమే అలాంటి పోస్టర్‌ ఒకటి మిగిలి ఉంది.

Updated Date - Apr 10 , 2026 | 04:00 AM