Mauritius President: కనకదుర్గమ్మను దర్శించుకున్న మారిషస్ అధ్యక్షుడు ధర్మబీర్ గోకుల్
ABN , Publish Date - Jan 06 , 2026 | 05:59 AM
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను సోమవారం మారిషస్ దేశ అధ్యక్షుడు ధర్మబీర్ గోకుల్ దంపతులు దర్శించుకున్నారు.
విజయవాడ(ఇంద్రకీలాద్రి)/తిరుమల, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను సోమవారం మారిషస్ దేశ అధ్యక్షుడు ధర్మబీర్ గోకుల్ దంపతులు దర్శించుకున్నారు. రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్, దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వీకే శీనానాయక్, జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ, నగర పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు తదితరులు ధర్మబీర్ గోకుల్ దంపతులకు ఘనంగా స్వాగతం పలకగా.. ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి అమ్మవారి ఆలయంలోకి తోడ్కోని వెళ్లారు. దర్శనం అనంతరం దేవస్థానం వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి, అమ్మవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదం, శేషవస్త్రం అందజేశారు.
నేడు తిరుమలకు ధరమ్ బీర్ గోకుల్
మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ శ్రీవారి దర్శనార్థం మంగళవారం తిరుమలకు రానున్నారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్‌లో శ్రీవారిని దర్శించుకుంటారు.