Share News

ఉపాధిలో మెటీరియల్‌ పనుల లక్ష్యం పూర్తి

ABN , Publish Date - Mar 20 , 2026 | 05:16 AM

ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ నిధుల పనుల్లో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ లక్ష్యాలను సాధించింది. రాష్ట్రానికి రావాల్సిన వాటా పనులను 15 రోజుల ముందుగానే పూర్తిచేసింది.

ఉపాధిలో మెటీరియల్‌ పనుల లక్ష్యం పూర్తి

  • నిర్మాణాల బిల్లులు రూ.3,277 కోట్లు అప్‌లోడ్‌

అమరావతి, మార్చి 19(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ నిధుల పనుల్లో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ లక్ష్యాలను సాధించింది. రాష్ట్రానికి రావాల్సిన వాటా పనులను 15 రోజుల ముందుగానే పూర్తిచేసింది. 2025- 26 లేబర్‌ బడ్జెట్‌ కింద ఏపీకి కేంద్రం 18కోట్ల పనిదినాలు మంజూరు చేసింది. ఇప్పటి వరకూ 18.09 కోట్ల పనిదినాలు పూర్తిచేసి నూరు శాతానికి మించి పనులు కల్పించారు. రూ.4,800 కోట్ల మేర ఉపాధి పనులు కల్పించడంతో రాష్ట్రానికి సుమారు రూ.3,200 కోట్ల మెటీరియల్‌ నిధులు దక్కనున్నాయి. అయితే రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఇప్పటికే రూ.3,277 కోట్ల మేర పనులు పూర్తిచేసి బిల్లులు అప్‌లోడ్‌ చేసింది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 14 వేల మినీ గోకులాలు నిర్మాణాలు పూర్తి అయినప్పటికీ పోర్టల్‌లో బిల్లులు అప్‌లోడ్‌ చేసుకునే అవకాశాన్ని కేంద్రం ఇవ్వకపోవడంతో బిల్లులు ఆగిపోయాయి. ఈ నిధుల కోసం రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.

Updated Date - Mar 20 , 2026 | 05:17 AM