బెజవాడ దుర్గమ్మకు అగ్గిపెట్టెలో చీర!
ABN , Publish Date - Jun 17 , 2026 | 06:13 AM
అగ్గిపెట్టెలో అమరే విధంగా పట్టుచీర నేసి విజయవాడ కనకదుర్గమ్మకు సమర్పించారు తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన..
తయారు చేసి కానుకగా సమర్పించిన తెలంగాణ వాసి విజయ్
విజయవాడ (ఇంద్రకీలాద్రి), జూన్ 16 (ఆంధ్రజ్యోతి): అగ్గిపెట్టెలో అమరే విధంగా పట్టుచీర నేసి విజయవాడ కనకదుర్గమ్మకు సమర్పించారు తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్. వారం రోజుల పాటు శ్రమించి ఇక్కత్ డిజైన్‌లో ఐదున్నర మీటర్ల పొడవు, 48 ఇంచుల వెడల్పుతో 200 గ్రాముల బరువు ఉండే విధంగా నేసిన ఈ పట్టు చీరను మంగళవారం ఆలయ ఈవో వి.కె.శీనానాయక్‌కు అందజేశారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ గతంలో తాను తయారు చేసిన ప్రతి సరికొత్త చేనేత సృష్టికి కనకద్గుమ్మ ఆశీస్సులు లభించాయన్నారు. గతంలో తాము ‘ఆపరేషన్ సింధు’ పేరిట శాలువను తయారు చేసి ప్రధాని నరేంద్ర మోదీకి అందజేసినట్టు తెలిపారు.