ఇంటర్ ఫలితాల్లో మాస్టర్‌మైండ్స్ విజయభేరి
ABN , Publish Date - Apr 17 , 2026 | 04:43 AM
ఇంటర్ ఫలితాల్లో మాస్టర్‌మైండ్స్ విద్యార్థులు అత్యత్తమ ప్రతిభ కనబరిచి విజయభేరి మోగించారని అడ్మిన్ డైరెక్టర్ మట్టుపల్లి మోహన్ తెలిపారు.
గుంటూరు(విద్య), ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): ఇంటర్ ఫలితాల్లో మాస్టర్‌మైండ్స్ విద్యార్థులు అత్యత్తమ ప్రతిభ కనబరిచి విజయభేరి మోగించారని అడ్మిన్ డైరెక్టర్ మట్టుపల్లి మోహన్ తెలిపారు. తమ విద్యార్థులు ఐదుగురు జూనియర్ ఇంటర్ ఎంఈసీలో 500 మార్కులకు గాను 496 మార్కులు సాధించారని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా 490పైగా మార్కులు సాధించన వారు 320 మంది, 450పైగా 2018 మంది ఉన్నారని వెల్లడించారు.అదే విధంగా సీనియర్ ఇంటర్‌లో తమ కళాశాల విద్యార్థిని గీతిక 984 మార్కులు సాధించినట్టు తెలిపారు. అదే విధంగా 980పైగా మార్కులు సాధించిన వారు 20 మంది, 950పైగా మార్కులు సాధించిన వారు 457 మంది, 900పైగా మార్కులు సాధించిన వారు 1041 మంది ఉన్నారని మోహన్ వెల్లడించారు.