Share News

సీఎంఏ ఫలితాల్లో మాస్టర్‌ మైండ్స్‌ జయభేరి

ABN , Publish Date - Aug 07 , 2026 | 05:06 AM

ది ఇనిసిట్ట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంట్స్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన సీఎం ఏ ఫలితాల్లో మాస్టర్‌ మైండ్స్‌ విద్యార్థులు జాతీయ ుస్థాయిలో ర్యాంకులు సాధించినట్టు అడ్మిన్‌ అడ్వయిజర్‌ మట్టుపల్లి మోహన్‌ వెల్లడించారు.

సీఎంఏ ఫలితాల్లో మాస్టర్‌ మైండ్స్‌ జయభేరి

  • ఫైనల్లో 1,3,7 ర్యాంకులు, ఇంటర్‌లో 4,8,9 ర్యాంకులు కైవసం

గుంటూరు (విద్య), ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ది ఇనిసిట్ట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంట్స్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన సీఎం ఏ ఫలితాల్లో మాస్టర్‌ మైండ్స్‌ విద్యార్థులు జాతీయ ుస్థాయిలో ర్యాంకులు సాధించినట్టు అడ్మిన్‌ అడ్వయిజర్‌ మట్టుపల్లి మోహన్‌ వెల్లడించారు. గుంటూరులోని మెయిన్‌ బ్రాంచ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎంఏ ఫైనల్లో మొదటి 10 ర్యాంకులలో 1, 3, 7 ర్యాంకులతో పాటు 26 మంది మాస్టర్‌ మైండ్స్‌ విద్యార్థులు 50లోపు ర్యాంకులు సాధించారని వివరించారు. సీఎంఏ ఇంటర్‌లో మొదటి 10 ర్యాంకులలో 4, 8, 9 ర్యాంకులతో పాటు 25 మంది 50లోపు ర్యాంకులు సాధించినట్టు తెలిపారు. సీఎంఏ ఫైనల్‌, ఇంటర్‌ ఫలితాల్లో మొదటి 10 ర్యాంకుల్లో 6 ర్యాంకులు తమ విద్యార్థులు సాధించినట్టు వివరించారు. అదేవిధంగా సీఎంఏ ఫైనల్‌, ఇంటర్‌లో మొదటి 50 ర్యాంకులు సాధించిన వారిలో 51 మంది తమ విద్యార్థులేనని తెలిపారు. జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన మట్టుపల్లి మోక్షిత్‌ కృష్ణను అడ్వయిజర్‌ మట్టుపల్లి మోహన్‌ తదితరులు అభినందించారు.

Updated Date - Aug 07 , 2026 | 05:07 AM