శేషాచల అడవుల్లో అగ్నిప్రమాదం
ABN , Publish Date - Mar 07 , 2026 | 05:10 AM
తిరుమల శేషాచల అడవుల్లో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. తిరుమలకు రెండు కిలోమీటర్ల...
తిరుమల, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): తిరుమల శేషాచల అడవుల్లో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. తిరుమలకు రెండు కిలోమీటర్ల దూరంలోని కాకులమాను అటవీ ప్రాంతంలో ఉన్న విండ్ మిల్ వద్ద భారీగా మంటలు వ్యాపిస్తున్నాయనే సమాచారంతో టీటీడీ విజిలెన్స్, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపుచేశారు.