అమరావతిలో భారీ అగ్నిప్రమాదం
ABN , Publish Date - Mar 24 , 2026 | 06:04 AM
రాజధాని అమరావతిలో మరోసారి భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి రాయపూడి సమీపంలో ప్రిన్సిపల్ సెక్రటరీల భవనాల వద్ద నిర్మాణ ప్రాంగణంలో చోటు చేసుకుంది.
మేఘా కంపెనీ ప్లాస్టిక్ పైపుల వద్ద నిప్పులు
నిర్మాణ ప్రాంగణంలో ఎగిసిపడిన మంటలు
రాయపూడి సమీపంలో ప్రమాదం
తుళ్లూరు, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో మరోసారి భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి రాయపూడి సమీపంలో ప్రిన్సిపల్ సెక్రటరీల భవనాల వద్ద నిర్మాణ ప్రాంగణంలో చోటు చేసుకుంది. కాంట్రాక్టు సంస్థ మేఘా కంపెనీకి చెందిన ప్లాస్టిక్ పైపుల వద్ద అకస్మాత్తుగా నిప్పులు చెలరేగాయి. దీంతో భారీగా మంటలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలను సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా అమరావతిలో ఇటీవల కూడా భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ నెల 11న ఎల్ అండ్ టీకి చెందిన ప్లాస్టిక్ పైపులు తగలబడటంతో కోట్లాది రూపాయల నష్టం జరిగింది.