టెక్నాలజీపై చంద్రబాబు ఆసక్తి ఆకట్టుకుంది!
ABN , Publish Date - Feb 07 , 2026 | 04:51 AM
ఏపీ ప్రభుత్వంతో కలిసి రాష్ట్రంలో 4 అత్యాధునిక ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌ల(ఏడీటీటీ)ను ఏర్పాటు చేయనున్నట్లు
మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో హిసాషి టేకుచి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): ఏపీ ప్రభుత్వంతో కలిసి రాష్ట్రంలో 4 అత్యాధునిక ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌ల(ఏడీటీటీ)ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండి యా శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో ఆ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ‘సీఎం చంద్రబాబుకు సాంకేతికత పై ఉన్న ఆసక్తి, విజన్ మమ్మల్ని ఆకట్టుకున్నాయి. వారి విజన్‌కు అనుగుణంగా ఏపీలో ఈ అత్యాధునిక ట్రాక్‌లను తీసుకురావడం మాకు గర్వకారణం’ అని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో హిసాషి టేకుచి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఏలూరు, ఒంగోలు, విజయనగరం, అనకాపల్లిలోని ప్రాంతీయ రవాణా కార్యాలయ ప్రాంగణాల్లో ఈ ఆటోమేటెడ్ ట్రాక్‌లను ఏర్పాటు చేయనున్నారు.