మార్కాపురంలో న్యాయాధికారి క్వార్టర్‌కు శంకుస్థాపన
ABN , Publish Date - Sep 28 , 2026 | 04:46 AM
మార్కాపురం ఆరవ అదనపు కోర్టు ప్రాంగణంలో సీనియర్ సివిల్ న్యాయాధికారి క్వార్టర్‌కు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ ఆలపాటి గిరిధర్, జస్టిస్ వై.లక్ష్మణరావు ఆదివారం శంకుస్థాపన చేశారు.
హాజరైన హైకోర్టు న్యాయమూర్తులు
మార్కాపురం టౌన్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): మార్కాపురం ఆరవ అదనపు కోర్టు ప్రాంగణంలో సీనియర్ సివిల్ న్యాయాధికారి క్వార్టర్‌కు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ ఆలపాటి గిరిధర్, జస్టిస్ వై.లక్ష్మణరావు ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం కోర్టు హాల్లో మార్కాపురం జిల్లాలోని వివిధ న్యాయస్థానాల న్యాయాధికారులతో సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయాధికారి సత్యానంద్, మార్కాపురం ఆరో అదనపు న్యాయాధికారి దుర్గాభవాని, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు, కోర్టు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ విజయసునీత, ఎస్పీ పంకజ్ కుమార్‌మీనా హైకోర్టు జడ్జిలను మర్యాద పూర్వకంగా కలిశారు.