Share News

మృతుల్లో నెల్లూరు జిల్లా వాసులు ఆరుగురు

ABN , Publish Date - Mar 27 , 2026 | 05:29 AM

హరికృష్ణ ట్రావెల్స్‌ బస్సు ప్రమాద దుర్ఘటనలో నెల్లూరు జిల్లాకు చెందిన ఆరుగురు మరణించారు. మృతుల్లో ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన ముత్తంగి ...

మృతుల్లో నెల్లూరు జిల్లా వాసులు ఆరుగురు

ఉదయగిరి, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): హరికృష్ణ ట్రావెల్స్‌ బస్సు ప్రమాద దుర్ఘటనలో నెల్లూరు జిల్లాకు చెందిన ఆరుగురు మరణించారు. మృతుల్లో ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన ముత్తంగి వెంకటేశ్వర్లు (45), నర్సింగు ప్రభావతి(38), చైత్రి(5), ఆత్మకూరు చిన్నయ్య (43), గుండ్లపల్లి వెంకటేశ్వర్లు (26), కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన కత్తి జయరాములు (55) ఉన్నారు. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్‌ టీడీపీ నాయకులతో కలిసి హుటాహుటిన ప్రమాద స్థలికి వెళ్లారు. అధికారుల ద్వారా వివరాలు తెలుసుకున్నారు. మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాదంలో మరణించినవారంతా పేదలు. రోజువారీ బేల్దారి పనుల కోసం తెలంగాణ వెళ్లారు. పండగకు తిరిగివస్తుండగా విషాదం చోటు చేసుకుంది.

Updated Date - Mar 27 , 2026 | 05:29 AM