మావోయిస్టు పార్టీ సభ్యుని లొంగుబాటు
ABN , Publish Date - May 04 , 2026 | 04:41 AM
మావోయిస్టు పార్టీ సభ్యుడు కొవ్వాసి దేవా పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు రంపచోడవరం ఓఎస్డీ పంకజ్ కుమార్ మీనా తెలిపారు.
ఎటపాక,మే 3(ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీ సభ్యుడు కొవ్వాసి దేవా పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు రంపచోడవరం ఓఎస్డీ పంకజ్ కుమార్ మీనా తెలిపారు. పోలవరం జిల్లా ఎటపాక పోలీస్ స్టేషన్‌లో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. దేవా ఛత్తీస్‌గఢ్‌లోని భీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని భూసాపూర్ గ్రామస్థుడని తెలిపారు. మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు విసిగిపోయి జనజీవన స్రవంతిలో కలిసినట్టు తెలిపారు. దేవాకు సరెండర్, పునరావాస పథకం ప్రకారం ప్రభుత్వం అందించే సదుపాయాలను కల్పిస్తామని ఓఎస్డీ వివరించారు.