Share News

మన్యం కలెక్టర్‌ సైకిల్‌ సవారీ

ABN , Publish Date - May 19 , 2026 | 06:11 AM

పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి సోమవారం సైకిల్‌పై కలెక్టరేట్‌కు వచ్చారు.

మన్యం కలెక్టర్‌ సైకిల్‌ సవారీ

పార్వతీపురం, మే 18(ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి సోమవారం సైకిల్‌పై కలెక్టరేట్‌కు వచ్చారు. రోజూ వచ్చే వాహనాన్ని పక్కనపెట్టి.. పార్వతీపురంలో తన బంగళా నుంచి సుమారు కిలోమీటరు మేర.. సైకిల్‌ తొక్కుకుంటూ కలెక్టరేట్‌కు చేరుకున్నారు. పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాపాడుకోవడం, ఇంధనాన్ని పొదుపు చేయడం అందరి బాధ్యత అని తెలిపారు.

Updated Date - May 19 , 2026 | 06:12 AM