Share News

మంత్రాలయం రోడ్డు ప్రమాదంలో 11కు చేరిన మృతుల సంఖ్య

ABN , Publish Date - Apr 19 , 2026 | 04:36 AM

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోణ సమీపంలో 16న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పదకొండుకు చేరింది.

మంత్రాలయం రోడ్డు ప్రమాదంలో 11కు చేరిన మృతుల సంఖ్య

మంత్రాలయం, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోణ సమీపంలో 16న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పదకొండుకు చేరింది. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుభ(32), ప్రైవేటు ఆసుపత్రిలో జయమ్మ(65) శనివారం మృతి చెందారు. ఇప్పటి వరకు మృతి చెందిన 11 మందిలో 9 మంది మహిళలు, మూడేళ్ల చిన్నారి ఉన్నారు. మంత్రాల యం ఎస్‌ఐ మల్లికార్జున కేసు నమోదు చేసి శుభ మృతదేహానికి కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి తమ్ముడు మనోజ్‌, దూరపు బంధువు కిరణ్‌కు అప్పగించారు. జయమ్మ మృతదేహానికి ఆదివారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు.

Updated Date - Apr 19 , 2026 | 04:37 AM