Share News

జగన్‌ పిల్ల చేష్టలు ఇంకా మానలేదు: మనోహర్‌

ABN , Publish Date - Apr 02 , 2026 | 04:51 AM

పార్లమెంటులో మన రాష్ట్ర బిల్లు చర్చకు వస్తే.. వైసీపీ ఎంపీలు కనీసం అభిప్రాయం వినిపించకుండా తలదించుకునేలా వ్యవహరించారని...

జగన్‌ పిల్ల చేష్టలు ఇంకా మానలేదు: మనోహర్‌

తెనాలి, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): పార్లమెంటులో మన రాష్ట్ర బిల్లు చర్చకు వస్తే.. వైసీపీ ఎంపీలు కనీసం అభిప్రాయం వినిపించకుండా తలదించుకునేలా వ్యవహరించారని, ఢిల్లీలో తెలుగు వారి ఆత్మ గౌరవానికి అవమానం కలిగించార ని రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌ మండిపడ్డారు. గుంటూరు జిల్లా తెనాలిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అధికారం పోయాక కూడా జగన్‌ తన తుగ్లక్‌ నిర్ణయాలతో పైశాచిక ఆనందం పొందడానికే ప్రాధాన్యమిస్తున్నారని విమర్శించారు. ఇటువంటి వ్యక్తులు మళ్లీ అధికారంలోకి వస్తే రాజధానిపై కుట్రలు పన్నకుండా ఉండేందుకే చట్టంలో ఒక ప్రత్యేక మార్పు తీసుకురావడానికి పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశ పెట్టాల్సిన ఖర్మ దేశ చరిత్రలో మన రాష్ట్రానికే పట్టిందన్నారు. మచిలీపట్నం-విజయవాడ-గుంటూరులను కలిపి రాజధాని చేయాలంటూ తాజాగా జగన్‌ చేస్తున్న కామెంట్లు చూస్తే ఆయన మానసిక పరిస్థితిపై ఆందోళన కలుగుతోందని పేర్కొన్నారు.

Updated Date - Apr 02 , 2026 | 04:51 AM