సబ్ కలెక్టర్‌గా మనీషా బాధ్యతల స్వీకరణ
ABN , Publish Date - Oct 05 , 2026 | 11:22 PM
స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్‌గా మనీషా సోమవారం ఆర్డీవో చల్లా విశ్వనాథ్ నుంచి బాధ్యతలు స్వీకరించారు.
నంద్యాల రూరల్/నూనెపల్లి, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్‌గా మనీషా సోమవారం ఆర్డీవో చల్లా విశ్వనాథ్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాలనలో పారదర్శ కతకు ప్రా ధాన్యత కల్పిస్తానని అన్నారు. ప్రతి ఉద్యోగి తమ విధిని, విద్యుత్త ధర్మాన్ని సక్రమంగా నిర్వహించినప్పుడే ప్రభుత్వ పాలనలో పారదర్శకత కనిపిస్తుందన్నారు. ఎలాంటి సమస్యలైనా తమ దృష్టికి తీసుకొచ్చి పరిష్కారాలు పొందాలన్నారు. సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన మనీషా కలెక్టరేట్లోని పీజీఆర్‌ఎస్ హాల్లో కలెక్టర్ రాజకుమారిని మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్‌కు పూలమొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.