డిమాండ్లు సాధించేవరకు ఆమరణ దీక్ష
ABN , Publish Date - Apr 12 , 2026 | 05:08 AM
బీసీ హక్కుల పరిరక్షణపై పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడంతోనే తాను ఆమరణ దీక్ష చేపట్టాల్సి వచ్చిందని బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ అన్నారు.
బీసీవై అధినేత రామచంద్రయాదవ్
మంగళగిరి, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): బీసీ హక్కుల పరిరక్షణపై పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడంతోనే తాను ఆమరణ దీక్ష చేపట్టాల్సి వచ్చిందని బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ అన్నారు. మంగళగిరిలోని తమ పార్టీ కార్యాలయం వద్ద శనివారం బీసీ ధర్మ దీక్ష పేరుతో ఆమరణ దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దీక్షను భగ్నం చేయడానికి ప్రయత్నిస్తే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీసీలకు రక్షణ చట్టం, అమరావతిలో వేయి ఎకరాల భూమి కేటాయింపు, కులగణన ద్వారా బీసీల జనాభా లెక్కలు తేల్చడం, విద్య, ఉద్యోగ రంగాలతో పాటు చట్టసభల్లో 44 శాతం రిజర్వేషన్లు, బీసీ కార్పొరేషన్లనకు నిధులు విడుదల తమ ప్రధాన డిమాండ్లని వివరించారు. వీటిపై వైసీపీ వైఖరిని చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ సూరజ్ మండల్, జ్యోతిరావు ఫూలే మునిమనుమరాలు రమాకాంత్ ఫూలే రామచంద్రయాదవ్‌కు సంఘీభావం ప్రకటించారు.