Share News

గంగమ్మ జాతరలో జంతు బలులు ఆపండి

ABN , Publish Date - May 06 , 2026 | 06:10 AM

తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా నిర్వహించే జంతు బలులను అరికట్టాలని సీఎం చంద్రబాబుకు కేంద్ర మాజీ మంత్రి, జంతు సంరక్షకురాలు మేనకాగాంధీ విజ్ఞప్తి చేశారు.

గంగమ్మ జాతరలో జంతు బలులు ఆపండి

  • సీఎం చంద్రబాబుకు మేనకా గాంధీ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, మే 5(ఆంధ్రజ్యోతి): తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా నిర్వహించే జంతు బలులను అరికట్టాలని సీఎం చంద్రబాబుకు కేంద్ర మాజీ మంత్రి, జంతు సంరక్షకురాలు మేనకాగాంధీ విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆమె చంద్రబాబుకు లేఖ రాశారు. మే 18,19 తేదీల్లో తిరుపతి గంగమ్మ ఆలయం వద్ద భారీ ఎత్తున జంతు బలులు జరగనున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిని వెంటనే నిలిపివేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ వంటి రాష్ర్టాల్లో జంతు బలులను పూర్తిగా నిషేధించారని, కర్ణాటకలో కూడా బలులకు బదులుగా కొబ్బరికాయలు కొట్టేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.

Updated Date - May 06 , 2026 | 06:10 AM