Share News

మహిళలను అవమానించే వారిపై కఠిన చట్టాలు తీసుకురావాలి

ABN , Publish Date - Jul 13 , 2026 | 03:46 AM

మూడో అంతర్జాతీయ రచయిత్రుల మహాసభలు విజయవాడలో ఆదివారం ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకలకు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ హాజరయ్యారు.

మహిళలను అవమానించే వారిపై  కఠిన చట్టాలు తీసుకురావాలి

  • ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌

  • ముగిసిన అంతర్జాతీయ రచయిత్రుల మహాసభలు

విజయవాడ కల్చరల్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి): మూడో అంతర్జాతీయ రచయిత్రుల మహాసభలు విజయవాడలో ఆదివారం ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకలకు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతృభాష పరిరక్షణకు ఇంటి నుంచే శ్రీకారం చుట్టాలన్నారు. మహిళలను అవమానించే వారిపై కఠిన చట్టాలు తీసుకురావాలని, దీనివల్ల సైబర్‌ నేరాలు కూడా తగ్గుతాయన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ ఆచార్య కేఆర్‌ రజని, ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ రాయపాటి శైలజ, ఏపీ కల్చరల్‌ అకాడమీ చైర్‌పర్సన్‌ పొడపాటి తేజస్విని ప్రసంగించారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ అధ్యక్షత వహించారు. రెండు రోజుల పాటు జరిగిన మహాసభల్లో పలు ఏకగ్రీవ తీర్మానాలు ప్రవేశపెట్టారు.

Updated Date - Jul 13 , 2026 | 03:46 AM