సమసమాజ స్థాపన కోసం జాతీయ స్థాయిలో పోరాటాలు
ABN , Publish Date - Aug 10 , 2026 | 04:21 AM
సమ సమాజ స్థాపనే లక్ష్యంగా తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా పోరాటాలను విస్తృతం చేయబోతున్నామని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి..
మంద కృష్ణ మాదిగ
ఒంగోలు కార్పొరేషన్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): సమ సమాజ స్థాపనే లక్ష్యంగా తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా పోరాటాలను విస్తృతం చేయబోతున్నామని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆదివారం నిర్వహించిన మాదిగ ఉద్యోగుల ఫెడరేషన్ జాతీయ సదస్సుకు మందకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ...ఎస్సీ వర్గీకరణతోనే ఎమ్మార్పీఎస్ పోరాటం ముగిసిపోలేదన్నారు. నిరుపేదలు, అణగారిన వర్గాల ప్రజల పక్షాన ఉద్యమిస్తామని తెలిపారు.