Share News

వర్ల రామయ్యతో మంద కృష్ణమాదిగ భేటీ

ABN , Publish Date - Jun 08 , 2026 | 05:12 AM

టీడీపీ సీనియర్‌ నేత వర్ల రామయ్యతో ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక నేత మంద కృష్ణమాదిగ భేటీ అయ్యారు.

వర్ల రామయ్యతో మంద కృష్ణమాదిగ భేటీ

అమరావతి, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): టీడీపీ సీనియర్‌ నేత వర్ల రామయ్యతో ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక నేత మంద కృష్ణమాదిగ భేటీ అయ్యారు. ఆదివారం మధ్యా హ్నం వర్ల నివాసానికి వచ్చి గంటపాటు చర్చించారు. ఇటీవల రాజ్యసభ అభ్యర్థిగా వర్ల రామయ్య పేరు తెరపైకి రావడం, వివిధ సమీకరణల నేపథ్యంలో చివరి నిమిషంలో ఆయనకు సీటు కేటాయించలేకపోవడం వంటి పరిణామాలపై ఇద్దరూ మాట్లాడుకున్నట్లు సమాచారం. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పాటించడమే తనకు తెలిసిన పనిగా వర్ల ఈ సందర్భంగా స్పష్టంచేశారు.

Updated Date - Jun 08 , 2026 | 05:13 AM