పాతబస్తిలో వ్యక్తి హత్య
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:18 AM
నగరంలోని వనటౌన పోలీస్ స్టేషన పరిధిలో పాతబస్తీలోని కండేరీ వీదిలో మనోహర్(40) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు.
కర్నూలు క్రైం, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): నగరంలోని వనటౌన పోలీస్ స్టేషన పరిధిలో పాతబస్తీలోని కండేరీ వీదిలో మనోహర్(40) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నిందితులు ఎరుకలి రాముడు, రాజు, నగేష్ మనోహర్‌పై కత్తితో దాడిచేశారు. కండేరీ చెందిన మారుతి, అతని చిన్నాన్న కొడుకు విజయ్ ఆదివారం రాత్రి పాతబస్టాండు అంబేడ్కర్ సర్కిల్ వద్దకు వెళ్లారు. అక్కడ వైనషాపు వద్ద బండిమెట్టకు చెందిన ఎరుకలి రాముడు అలియాస్ మూగి అక్కడే ఉన్నారు. ఎరుకలి రాముడుకి విజయ్‌కు మాటామాటా పెరిగి కొట్టుకునే స్థాయికి చవచ్చారు. అయితే మారుతి వారిని విడిపించి విజయ్‌ను తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు. విషయాన్ని ఎరుకలి రాముడు తన మిత్రుడు రాజుకు చెప్పాడు. ఆగ్రహానికి గురైన రాజు మారుతికి పోనచేసి అసభ్యపదజాలంతో దూషించాడు. దీంతో మారుతి ఉదయాన్నే మాట్లాడుకుందామని పోన కట్ చేయడంతో ఎరుకలి రాముడు, ఆయన మిత్రుడు రాజు, అన్న కొడుకు నగేష్ ముగ్గురు కలిసి మారుతి, విజయ్‌ల ఇంటి వద్దకు వెళ్లి, మారుతి, విజయ్‌లపై దాడిచేసి తీవ్రంగా కొట్టారు. వీరి ఇంటిపైననే ఉండే మారుతి సోదరుడు మనోహర్ కిందకు వచ్చి విడిపించే ప్రయత్నం చేశాడు. దీంతో రాముడు, రాజు, నగేష్ ముగ్గురు కలిసి కత్తితో మనోహర్ మెడపైన కొట్టారు. తీవ్ర రక్తగాయాలైన మనోహర్‌ను అక్కడే వదిలేసి ముగ్గురు నిందితులు పరరయ్యారు. అప్పటికే గాయాలైన మారుతి, విజయ్‌తో పాటు మనోహర్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లారు. కాగా మనోహర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మారుతి ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు మనోహర్ బ్యాంకు రికవరీ గ్రూపులో మెంబర్‌గా ఉన్నాడు. మృతునికి భార్య పిల్లలు ఉన్నారు. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బందువులకు అప్పగించారు. మనోహర్ మృతితో ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు.