Share News

బైకుపైనే మృతదేహం తీసుకెళ్లి..

ABN , Publish Date - May 11 , 2026 | 05:03 AM

అన్నమయ్య జిల్లా చౌడేపల్లె మండలం ఎగువ మల్లెలవారిపల్లెకు చెందిన వెంకటేష్‌(30) ఆదివారం ఛాతీ నొప్పితో బాధపడ్డారు.

బైకుపైనే మృతదేహం తీసుకెళ్లి..

ఇంటర్నెట్ డెస్క్: అన్నమయ్య జిల్లా చౌడేపల్లె మండలం ఎగువ మల్లెలవారిపల్లెకు చెందిన వెంకటేష్‌(30) ఆదివారం ఛాతీ నొప్పితో బాధపడ్డారు. మిత్రుడితో కలిసి మోటారు సైకిల్‌లో చౌడేపల్లెలో ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లారు. ఆయన ఇంజక్షన్‌ వేశారు. ఛాతీ నొప్పి ఎక్కువగా ఉందనడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అప్పటికే వెంకటేష్‌ మృతిచెందాడని వైద్యుడు చెప్పారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు అక్కడున్న ఆటోడ్రైవర్లను కోరగావారు నిరాకరించారు. ఈ క్రమంలో స్నేహితులు ఆరు కిలోమీటర్ల దూరంలోని గ్రామానికి బైక్‌పైనే మృతదేహాన్ని తీసుకొచ్చారు.

- చౌడేపల్లె, ఆంధ్రజ్యోతి

Updated Date - May 11 , 2026 | 05:04 AM