Kanchili Railway Station: రైలుపైకి ఎక్కి యువకుడి హల్‌చల్
ABN , Publish Date - Jan 05 , 2026 | 04:18 AM
శ్రీకాకుళం జిల్లా కంచిలి రైల్వేస్టేషన్‌లో ఓ యువకుడు రైలు పైకి ఎక్కి పరిగెడుతూ హల్‌చల్ చేశాడు. ఆదివారంమధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.
శ్రీకాకుళం జిల్లా కంచిలి రైల్వేస్టేషన్‌లో ఘటన
20 నిమిషాలు నిలిచిన భువనేశ్వర్-తిరుపతి ఎక్స్‌ప్రెస్
కంచిలి, జనవరి 4(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా కంచిలి రైల్వేస్టేషన్‌లో ఓ యువకుడు రైలు పైకి ఎక్కి పరిగెడుతూ హల్‌చల్ చేశాడు. ఆదివారంమధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో కంచిలి రైల్వేస్టేషన్‌కు భువనేశ్వర్-తిరుపతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు వచ్చి ఆగింది. అప్పుడు పశ్చిమ బెంగాల్‌కు చెందిన విజయ్ సర్కార్ అనే యువకుడు రైలు బోగి పైకి ఎక్కాడు. అటూ.. ఇటూ పరుగులు పెట్టాడు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దీనిని గమనించి రైల్వే అధికారులు ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. పోలీసుల సహాయంతో ఆ యువకుడిని కిందకు దించారు. అతడి వద్ద విశాఖ-హౌరా మెయిల్ టికెట్ లభించింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆ యువకుడు మతిస్థిమితం లేనివిధంగా ప్రవర్తించడంతో.. స్థానిక పోలీసుస్టేషన్‌కు తరలించారు. స్టేషన్ మాస్టర్ బలరాం బెహరా సమాచారం మేరకు స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. యువకుడి హల్‌చల్ కారణంగా రైలు సుమారు 20 నిమిషాలపాటు కంచిలి స్టేషన్‌లో నిలిచిపోయింది.