Share News

ఎమ్మెల్యే పేరుతో నకిలీ కారుపాస్‌లు

ABN , Publish Date - Apr 16 , 2026 | 04:55 AM

ఎమ్మెల్యే పేరుతో నకిలీ కార్‌ పాస్‌లను తయారుచేసి విక్రయిస్తున్న వ్యక్తిని ప్రకాశం జిల్లా బల్లికురవ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం..

ఎమ్మెల్యే పేరుతో నకిలీ కారుపాస్‌లు

  • తయారుచేస్తున్న విజయవాడ వాసి అరెస్టు

బల్లికురవ(అద్దంకి), ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే పేరుతో నకిలీ కార్‌ పాస్‌లను తయారుచేసి విక్రయిస్తున్న వ్యక్తిని ప్రకాశం జిల్లా బల్లికురవ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడకు చెందిన చేబ్రోలు నాగరాజు విద్యుత్‌ శాఖ మంత్రి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ పేరుతో నకిలీ కార్‌ పాస్‌లను తయారుచేస్తున్నాడు. వాటిని రూ.2వేలకు విక్రయిస్తున్నాడు. ఇటీవల బల్లికురవలో విక్రయిస్తుండగా నాగబోయిన నాగరాజు అనే వ్యక్తి అనుమానంతో ప్రశ్నించాడు. దీంతో అప్రమత్తమైన చేబ్రోలు నాగరాజు అక్కడి నుంచి పరారయ్యాడు. నాగబోయిన నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు చేబ్రోలు నాగరాజును బుధవారం బల్లికురవ సెంటర్‌లో అరెస్టు చేశారు. అతని నుంచి రెండు నకిలీ కారుపాస్‌లను స్వాధీనం చేసుకున్నట్టు బల్లికురవ ఎస్‌ఐ నాగరాజు తెలిపాడు.

Updated Date - Apr 16 , 2026 | 04:56 AM