జగన్‌తో టి-డిప్యూటీ సీఎం భట్టి భేటీ
ABN , Publish Date - Mar 04 , 2026 | 04:45 AM
మాజీ ముఖ్యమంత్రి జగన్‌తో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం భేటీ అయ్యారు.
తన కుమారుడి పెళ్లికి రావాలని ఆహ్వానం
హైదరాబాద్, మార్చి 3(ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి జగన్‌తో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం భేటీ అయ్యారు. అమరావతిలో ని జగన్ నివాసంలో భేటీ అయిన భట్టి.. ఈ నెల 5న హైదరాబాద్‌లో జరిగే తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి హాజరుకావాలని జగన్‌ను ఆహ్వానించారు. జగన్‌కు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.