Share News

మల్లిన సేవలు మరువలేనివి

ABN , Publish Date - Mar 09 , 2026 | 05:07 AM

ప్రముఖ పారిశ్రామికవేత్త, గౌతమి సాల్వెంట్‌ ఆయిల్స్‌ అధినేత మల్లిన రామచంద్రరావు సేవలు మరువలేనివని పలువురు ప్రముఖులు, వ్యక్తలు అన్నారు.

మల్లిన సేవలు మరువలేనివి

  • రామచంద్రరావు సంస్మరణ సభలో వక్తలు

తణుకు, మార్చి 8(ఆంధ్రజ్యోతి): ప్రముఖ పారిశ్రామికవేత్త, గౌతమి సాల్వెంట్‌ ఆయిల్స్‌ అధినేత మల్లిన రామచంద్రరావు సేవలు మరువలేనివని పలువురు ప్రముఖులు, వ్యక్తలు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని కమ్మ కళ్యాణ మండపంలో మల్లిన రామచంద్రరావు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం కలిగిన వ్యక్తి అని.. ఎంతోమంది యువ పారిశ్రామికవేత్తలకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. విద్య, వైద్య, సమాజ సేవలో ముందుండే వారని పేర్కొన్నారు. రామచంద్రరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళుర్పించారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు మల్లిన వెంకట్రాయుడు, మల్లిన రవికాంత్‌, భోగవల్లి ఇందిరాదేవి, భోగవల్లి శ్రీమన్నారాయణ, కలగర హరిశ్చంద్రరావు, కోడూరి ఆంజనేయులు, కలగర వెంకట కృష్ణ, పుట్టా రామచంద్రరావు పాల్గొన్నారు.

Updated Date - Mar 09 , 2026 | 05:07 AM