Devotional Ceremonies: భృంగి వాహనంపై మల్లికార్జునుడు
ABN , Publish Date - Jan 14 , 2026 | 04:51 AM
సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైల క్షేత్రంలో రెండో రోజు మల్లికార్జున స్వామి, భ్రమరాంబికాదేవి భృంగి వాహనంపై విహరించారు.
శ్రీశైలంలో వైభవంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
శ్రీశైలం, జనవరి 13(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైల క్షేత్రంలో రెండో రోజు మల్లికార్జున స్వామి, భ్రమరాంబికాదేవి భృంగి వాహనంపై విహరించారు. మంగళవారం ఉదయం స్వామివారి యాగశాలలో చండీశ్వరునికి విశేష పూజలు, లోక కల్యాణార్థం జపాలు, పారాయణాలు, పంచావరణార్చనలు, మండపారాధనలు, రుద్రహోమం, అమ్మవారికి చండీహోమం, ప్రదోషకాల పూజలు, జపానుష్టానాలు, హోమాలు నిర్వహించారు. సాయంత్రం అక్కమహాదేవి అలంకార మండపంలో ప్రత్యేకంగా అలంకరించిన పుష్పవేదికపై స్వామి, అమ్మవార్లను భృంగి వాహనంపై ఆశీనులుజేసి షోడశోపచార పూజలు జరిపించారు. అనంతరం అధికారులు, సిబ్బంది, అర్చకులు గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.